హైదరాబాద్: సీనియర్ తెలుగు నటుడు గిరిబాబు (80) శనివారం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన అసలు పేరు యర్ర శేషగిరిరావు. 1946 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించారు.
నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టిన గిరిబాబు, 1973లో ‘జగమే మాయ’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. దాదాపు ఐదు దశాబ్దాల కెరీర్లో 600కు పైగా చిత్రాల్లో నటించారు. తొలినాళ్లలో హీరోగా నటించినా, తర్వాత విలన్‌గా ప్రత్యేక గుర్తింపు పొందారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గానూ రాణించారు.
నిర్మాతగా, దర్శకుడిగానూ గిరిబాబు ముద్ర
‘కరుణామయుడు’, ‘సింహగర్జన’, ‘కంచు కాగడా’, ‘సింహాసనం’, ‘ఖడ్గం’, ‘అతడు’, ‘గమ్యం’, ‘ఢమరుకం’, ‘గీత గోవిందం’ తదితర చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటనతో పాటు జయభేరి పిక్చర్స్ నిర్మాణ సంస్థను స్థాపించి పలు చిత్రాలు నిర్మించారు. ‘రణరంగం’, ‘ఇంద్రజిత్’, ‘నీ సుఖమే నే కోరున్యన్న’ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
ఆయన కుమారుడు, ప్రముఖ నటుడు రఘుబాబు ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. గిరిబాబు మృతిపై సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని సినీ వర్గాలు పేర్కొన్నాయి.
