హైదరాబాద్: 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలు సోమవారం రంగారెడ్డి జిల్లాలోని సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్లో ప్రారంభమయ్యాయి. తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరై ఐదు రోజుల జాతీయ పోటీలను ప్రారంభించారు.
ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో సీఆర్పీఎఫ్ పోటీలను నిర్వహిస్తోంది. నవంబర్ 16 నుంచి 20 వరకు జరిగే పోటీల్లో 25కు పైగా బ్యాండ్లు, సుమారు 1,500 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, బ్యూగల్ ప్రదర్శనలు ఉంటాయి.
పోలీస్ బ్యాండ్ పోటీలపై డీజీపీ ప్రశంసలు
పోలీస్ బ్యాండ్లు క్రమశిక్షణ, గర్వం, ఐక్యతకు ప్రతీకలని ఆనంద్ అన్నారు. ప్రజలతో అనుబంధం పెంచుతాయని పేర్కొన్నారు. 2023 నుంచి బ్యాండ్లలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది.
నవంబర్ 17న సాయంత్రం 5.30కు శిల్పారామంలో సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సమక్షంలో, 18న అదే సమయానికి లుంబినీ పార్క్లో తమన్ సమక్షంలో ప్రజల కోసం ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయి.
