హైదరాబాద్: ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్సీ) 85వ వార్షిక సదస్సును కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నవంబర్ 19న ప్రారంభించనున్నారు. హైటెక్స్‌లో ఉదయం 11.30 గంటలకు ప్రారంభోత్సవం జరుగుతుంది.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పలువురు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ నాలుగు రోజుల సదస్సు
తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ ఆతిథ్యం ఇస్తున్న ఈ నాలుగు రోజుల సదస్సు నవంబర్ 22 వరకు కొనసాగుతుంది. కీలకోపన్యాసంలో గడ్కరీ ఐఆర్సీ లక్ష్యాలు, ప్రాముఖ్యతను వివరిస్తారు. తెలంగాణకు కీలక రహదారి ప్రాజెక్టులను ఆయన ప్రకటించే అవకాశం ఉంది.
ప్రారంభోత్సవం తర్వాత మధ్యాహ్నం 1 గంటకు గడ్కరీ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాష్ట్రంలో కొనసాగుతున్న జాతీయ రహదారి ప్రాజెక్టుల పురోగతిని ఆయన ఈ సమావేశంలో సమీక్షిస్తారు.
