ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సులో గడ్కరీ ప్రసంగం

హైదరాబాద్: ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ 85వ వార్షిక సమావేశంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడారు. తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ముఖ్యమంత్రి లక్ష్యం, భారత్‌ను ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేయాలన్న ప్రధాని ఆశయాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు.

రోడ్లు, నీరు, విద్యుత్, సమాచార రంగాలతో కూడిన మౌలిక సదుపాయాలు ఈ లక్ష్యానికి కీలకమని చెప్పారు. మంచి రోడ్లు అభివృద్ధిని, పెట్టుబడులను ఆకర్షిస్తాయన్నారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి రూ.10,000 కోట్లు వెచ్చించగా, సుమారు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఉదహరించారు.

ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ వేదికగా గడ్కరీ పిలుపు

ఆత్మనిర్భర్ భారత్, వికసిత భారత్ నిర్మాణానికి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని గడ్కరీ పిలుపునిచ్చారు.

వాజ్‌పేయి హయాంలో గ్రామాలను అనుసంధానించేందుకు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రూపుదిద్దుకుందని గుర్తుచేసుకున్నారు.