హైదరాబాద్: 2027 సంవత్సరానికి ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ను నవంబర్ 30, 2026లోగా పూర్తిచేయాలని వ్యాపారులను, వాణిజ్య సంస్థలను జీహెచ్ఎంసీ కోరింది. జీహెచ్ఎంసీ పరిధిలోని దుకాణాలు, వ్యాపారాలకు ఇది వర్తిస్తుంది.
2026 లైసెన్సులు డిసెంబర్ 31 వరకు చెల్లుబాటవుతాయని కమిషనర్ తెలిపారు. రెన్యువల్ అయిన లైసెన్సులు 2027 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు వర్తిస్తాయి.
ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్: ఆలస్యమైతే జరిమానాలు
నవంబర్ 30లోగా దరఖాస్తు చేస్తే ఆలస్య రుసుము లేదు. డిసెంబర్ 1 నుంచి జనవరి 31 వరకు 25 శాతం, ఫిబ్రవరి 1 నుంచి 50 శాతం జరిమానా. లైసెన్స్ లేని వ్యాపారాలకు 100 శాతం జరిమానాతో పాటు నెలకు 10 శాతం అదనపు జరిమానా ఉంటుంది.
ghmc.gov.in, మై క్యూర్ యాప్, మీ-సేవ, సిటిజన్ సర్వీస్ సెంటర్లలో దరఖాస్తు చేయవచ్చు.
