హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) ఏఐ బోలు ప్రయాణికుల సహాయ వ్యవస్థను ఏడు స్టేషన్లకు విస్తరించింది. ఇందులో దేశీయ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ‘యాత్రి ఎల్ఎల్ఎం’ను ప్రవేశపెట్టింది. 2026 మేలో కాచిగూడ, మల్కాజిగిరిలో సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు కర్నూల్ సిటీ, గద్వాల్, మహబూబ్‌నగర్, కామారెడ్డి, నిజామాబాద్‌లకు విస్తరించాయి.
ప్రారంభంలో రోజుకు సుమారు 200గా ఉన్న ప్రయాణికుల సంప్రదింపులు ఇప్పుడు 2,000 దాటాయి. ఏఐ ఆధారిత వాయిస్ సహాయ సేవలు ప్రవేశపెట్టిన తొలి రైల్వే జోన్‌గా ఎస్సీఆర్ నిలిచింది.
ఏఐ బోలు తో రియల్ టైమ్ సమాచారం
ప్రయాణికులు సహజ భాషలో ప్రశ్నలు అడగవచ్చు. రైళ్ల రన్నింగ్ స్టేటస్, బెర్త్ లభ్యత, కోచ్ పొజిషన్, స్టేషన్ మ్యాప్‌ల వివరాలు అందుతాయి. బోలు మినీ, బోలు మ్యాక్స్ అనే రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి.
వృద్ధులు, తొలిసారి ప్రయాణించేవారు, దివ్యాంగులకు ఇది ఉపయోగపడుతుంది. దీన్ని అమలు చేసిన హైదరాబాద్ డివిజన్ బృందాన్ని ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అభినందించారు.

