తిరుమల: తిరుమలలో ఒక భక్తురాలు పోగొట్టుకున్న సుమారు 40 గ్రాముల బంగారు బ్రేస్‌లెట్‌ను సీసీటీవీ ఫుటేజ్ సాయంతో గుర్తించిన టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది ఆమెకు తిరిగి అప్పగించారు.
హైదరాబాద్‌కు చెందిన భక్తురాలు శ్రీపాద రాజ శ్రుతి శుక్రవారం అనుకోకుండా బ్రేస్‌లెట్ జారవిడుచుకున్నారు. ప్రసాదం పంపిణీ కేంద్రం సమీపంలోని తాగునీటి పాయింట్ వద్ద ఇది జరిగింది. ఆమె వెనుక నడుస్తున్న కొందరు భక్తులు అది చేతి నుంచి పడటం గమనించి తీసుకున్నారు. అదే ఘటనను కమాండ్ కంట్రోల్ సిబ్బంది సీసీటీవీ కెమెరాల్లో గమనించి వెంటనే స్పందించారు.
సీవీఎస్‌వో ఆదేశాలతో బంగారు బ్రేస్‌లెట్ గుర్తింపు
టీటీడీ సీవీఎస్‌వో కె.వి. మురళీకృష్ణ ఆదేశాల మేరకు కమాండ్ కంట్రోల్ ఏవీఎస్‌వో వెంకటరమణ, ఆయన బృందం బ్రేస్‌లెట్‌ను గుర్తించారు. విజిలెన్స్ అధికారి సురేంద్ర పర్యవేక్షణలో ఈ ప్రక్రియ సాగింది. ఆ తర్వాత బ్రేస్‌లెట్‌ను యజమానికి అప్పగించినట్లు వెంకటరమణ తెలిపారు.
సకాలంలో స్పందించిన టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ అధికారులు, సిబ్బందికి భక్తురాలు సంతోషంతో కృతజ్ఞతలు తెలిపారు.
