జీహెచ్‌ఎంసీ ‘ప్రాజెక్ట్‌ ఉద్వాసన’: శనివారం పాత విగ్రహాల సేకరణ

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ శనివారం (నవంబర్‌ 14) పాత విగ్రహాల సేకరణ కోసం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనుంది. ‘ప్రాజెక్ట్‌ ఉద్వాసన’ కింద ఆరు జోన్లలో 12 ఆలయాలను సేకరణ కేంద్రాలుగా గుర్తించింది.

ఈ కేంద్రాలు ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు పనిచేస్తాయి. పాత విగ్రహాలు, దేవుళ్ల ఫొటోలు, క్యాలెండర్లు, ఇతర పవిత్ర వస్తువులను అక్కడ అందజేయాలని జీహెచ్‌ఎంసీ నగరవాసులను కోరింది. 11 గంటలకే సేకరణ ముగుస్తుందని స్పష్టం చేసింది.

పాత విగ్రహాల సేకరణ కేంద్రాలు ఇవే

శంషాబాద్‌, చార్మినార్‌, రాజేంద్రనగర్‌, గోల్కొండ, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌ జోన్లలో ఒక్కో జోన్‌కు రెండు కేంద్రాలను గుర్తించారు. బాలాపూర్‌, జల్‌పల్లి, మూసారాంబాగ్‌, చాంద్రాయణగుట్ట, కార్వాన్‌, హిమాయత్‌నగర్‌, కాచిగూడ తదితర ప్రాంతాల్లోని ఆలయాలు ఇందులో ఉన్నాయి.

పోస్టర్‌పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి సమీప కేంద్రాన్ని తెలుసుకోవచ్చు. పవిత్ర వస్తువులను సాధారణ చెత్తతో కలిపి పారేయవద్దని జీహెచ్‌ఎంసీ సూచించింది. పర్యావరణ పరిరక్షణ కూడా ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపింది.