హైదరాబాద్: జనగామ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవాన్ని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ సోమవారం అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో రూ.154 కోట్లతో నిర్మించిన కళాశాల భవనం, క్రిటికల్ కేర్ బ్లాక్ సిద్ధంగా ఉన్నాయని అధికారులు వివరించారు.
కరీంనగర్ మెడికల్ కాలేజీ నిర్మాణంలో జాప్యంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. బాలికల హాస్టల్‌ను నవంబర్ చివరికి, బాలుర హాస్టల్‌ను డిసెంబర్ చివరికి అప్పగించాలన్నారు. ప్రధాన భవనాన్ని మార్చి చివరికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
జనగామ మెడికల్ కాలేజీ సహా ఇతర ప్రాజెక్టుల గడువులు
సిద్దిపేట బోధనాసుపత్రి పనులను వేగవంతం చేసి, మార్చి చివరి వారంలో ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి పనులనూ త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.
