మెడికల్ షాపుల తనిఖీలు: 90 షాపులకు షోకాజ్ నోటీసులు

హైదరాబాద్: నవంబర్ 19న క్యూర్ ప్రాంతం, ఇతర జిల్లాల్లో టీజీ సేఫ్ డ్రగ్స్ వింగ్ నిర్వహించిన మెడికల్ షాపుల తనిఖీలు 90 దుకాణాల్లో ఉల్లంఘనలను బయటపెట్టాయి. అన్ని షాపులకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

మత్తు కలిగించే మందుల అక్రమ విక్రయాన్ని, యాంటీబయాటిక్స్ అమ్మకాలను బృందాలు పరిశీలించాయి. కొన్ని షాపులు చెల్లుబాటయ్యే ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులిచ్చాయి; కొన్నిచోట్ల రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ లేరు; రిజిస్టర్లు, బిల్లింగ్ రికార్డులు సరిగా లేవు.

మెడికల్ షాపుల తనిఖీలు, లైసెన్స్ రద్దు హెచ్చరిక

నోటీసులకు వచ్చే సమాధానాలను పరిశీలించి, ఉల్లంఘనల తీవ్రత ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. చట్టం, నిబంధనల ప్రకారం లైసెన్సులను సస్పెండ్ లేదా రద్దు చేయవచ్చు.

డాక్టర్ రాసిస్తేనే యాంటీబయాటిక్స్ వాడాలని అధికారులు సూచించారు. అక్రమ విక్రయాలపై టీజీ సేఫ్ 1800-599-6969 హెల్ప్‌లైన్‌కు పని దినాల్లో ఫిర్యాదు చేయవచ్చు.