గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు: నిర్లక్ష్యం వద్దన్న రేవంత్

హైదరాబాద్: గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, నిర్లక్ష్యాన్ని సహించబోమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. నవంబర్ 23న జరిగిన సమీక్షలో ఆయన, దేశ విదేశీ ప్రతినిధులకు అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు.

శాఖల మధ్య సమన్వయం పెంచాలన్నారు. ప్రతినిధుల ప్రవేశానికి ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థను ప్రవేశపెట్టి, సహాయానికి అనుసంధాన అధికారులను నియమించాలని ఆదేశించారు.

గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు: తెలంగాణ సంస్కృతికి ప్రాధాన్యం

వేదిక రూపకల్పనలో సమ్మక్క–సారలమ్మ ఆలయ సంప్రదాయ తోరణాల తరహా నమూనాలను వాడాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు ఎయిర్ షోలో పాల్గొనేలా చూడాలన్నారు.

ఎడ్యుకేషన్ పెవిలియన్‌లో ప్రముఖ దేశ, విదేశీ విశ్వవిద్యాలయాలు పాల్గొనేలా చూడాలన్నారు. ప్రముఖుల ఆహ్వాన బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, డి. శ్రీధర్ బాబుకు అప్పగించాలని సూచించారు.