హైదరాబాద్: మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ పోలీసుల ఆధ్వర్యంలో సైక్లింగ్ ర్యాలీ నిర్వహించారు. “మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంచుకోండి” అనే సందేశంతో ఈ ర్యాలీ సాగింది.
ఐక్యతతో పాటు డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. “ఆరోగ్యవంతమైన రేపటి కోసం ముందడుగు” నినాదంతో ర్యాలీ కొనసాగింది.
డ్రగ్స్ రహిత సమాజం కోసం సైక్లింగ్ ర్యాలీ
ర్యాలీ నిర్వహణలో సహకరించిన జమ్మూ-కాశ్మీర్ పోలీసులకు తెలంగాణ పోలీసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
