కాళోజీ కళాక్షేత్రం కళలకే: సీఎం రేవంత్ ఆదేశం

హనుమకొండ: కాళోజీ కళాక్షేత్రం కేవలం కళా, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకే ఉపయోగపడాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జ్ఞాపకార్థం నిర్మించిన ఈ కళాక్షేత్రం విషయంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌కు ఆయన సూచనలు చేశారు.

కళాక్షేత్రంలోకి ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తున్నారన్న వార్తలపై ముఖ్యమంత్రి స్పందించారు. అక్కడికి ప్రభుత్వ కార్యాలయాలను మార్చవద్దని స్పష్టంగా ఆదేశించారు.

కాళోజీ కళాక్షేత్రం ఇకపై కళలకే

కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమాలను ఖరారు చేసే బాధ్యతను కూడా ముఖ్యమంత్రి కలెక్టర్‌కు అప్పగించారు. ఇందుకోసం కాళోజీ ఫౌండేషన్ సభ్యులతో కలెక్టర్ చర్చించాలని సూచించారు.