హైదరాబాద్: ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) అధికారులు నాలుగు సంస్థల ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులను సస్పెండ్ చేశారు. రెండింటిని మూసివేయించారు. వినియోగదారుల ఫిర్యాదులతో ఎనిమిది బృందాలు క్యూర్ ప్రాంతంలో తొమ్మిది రెస్టారెంట్లు, హాస్టళ్లను తనిఖీ చేశాయి.
అపరిశుభ్ర వంటశాలలు, బొద్దింకలు, ఎలుకల బెడద, మూసుకుపోయిన డ్రైన్లు కనిపించాయి. ఆహార నిల్వ సరిగా లేదని, శాకాహార, మాంసాహారాలను వేరు చేయలేదని, తప్పనిసరి రికార్డులు లేవని గుర్తించారు. కల్తీ అనుమానంతో ఎనిమిది నమూనాలు సేకరించి, సుమారు 135 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
ఫుడ్ సేఫ్టీ తనిఖీలు: లైసెన్సుల సస్పెన్షన్
మాదాపూర్ బావర్చి, కూకట్పల్లి ది స్పైస్ కిచెన్, టోలిచౌకి మతామ్ అల్ యమాని, చందానగర్ అన్నపూర్ణ కేటరర్స్ లైసెన్సులు సస్పెండ్ అయ్యాయి. టోలిచౌకి అల్ కరీం బేకర్స్, గౌలిదొడ్డి శ్రీ లక్ష్మి లగ్జరీ మెన్స్ హాస్టల్‌ను లైసెన్సు లేనందున మూసివేయించారు.
చైతన్యపురి రాజు గారి బిర్యానీ, నాగోల్ స్వాద్ స్పైసీకి షోకాజ్ నోటీసులు ఇస్తారు. బాల్కంపేట మెహఫిల్కు మెరుగుదల నోటీసు ఇచ్చారు. సస్పెండైన సంస్థలను స్విగ్గీ, జొమాటోల నుంచి తొలగించాలని కోరనున్నారు.
