వికారాబాద్: జిల్లాలోని బుగ్గరామేశ్వరం సమీపంలో ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. వికారాబాద్ రోడ్డు ప్రమాదంలో చనిపోయినవారిని చంద్రమ్మ, పార్వతమ్మ, సరిత, నగేష్గా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆటో పెండ్లిమడుగు నుంచి కెరెల్లి వైపు వెళ్తోంది.
ఈ ఘటనపై తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడం ఎంతో బాధాకరమని ఆయన అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వికారాబాద్ రోడ్డు ప్రమాదంపై పోలీసులను ఆరా తీసిన స్పీకర్
ప్రమాదం ఎలా జరిగిందో స్థానిక పోలీసు అధికారులను స్పీకర్ అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
మృతుల ఆత్మకు శాంతి కలగాలని ఆయన ప్రార్థించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
