వాట్సాప్ వెబ్ వాడకంపై ఐ4సీ అడ్వైజరీ

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) వాట్సాప్ వెబ్‌పై అడ్వైజరీ జారీ చేసింది. లాగిన్ అయి ఉన్న సెషన్లు దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని వినియోగదారులను హెచ్చరించింది.

ఆఫీస్, పబ్లిక్ కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్‌తో జాగ్రత్త

ముఖ్యంగా ఆఫీస్, షేర్డ్, పబ్లిక్ కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ తెరిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అడ్వైజరీ సూచించింది. అనధికారిక యాక్సెస్ వల్ల మెసేజ్‌లు, కాంటాక్ట్‌లు, గ్రూప్ సంభాషణల భద్రత దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొంది.

ఈ అడ్వైజరీని పంచుకుంటూ ‘అప్రమత్తంగా ఉండండి. సైబర్ సురక్షితంగా ఉండండి!’ అని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది.