ఆదర్శ గ్రామాలు: ములుగు కార్యాచరణపై సీతక్క సమీక్ష

ములుగు: జిల్లాలోని కనీసం 5 నుంచి 6 గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయిలో ఆదర్శ గ్రామాలుగా మారతాయని మంత్రి సీతక్క తెలిపారు. సర్పంచ్‌లు, ఎంపీడీవోలు, అధికారులతో వీబీ జీ రామ్ జీ కార్యాచరణ ప్రణాళికపై సమీక్షించిన సందర్భంగా ఆమె ఈ విషయం చెప్పారు.

ప్రతి కుటుంబానికి ఉపాధి లభించాలని, అన్ని గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా మారాలని ఆమె అన్నారు. తండా అయినా, గూడెం అయినా, అటవీ గ్రామమైనా అర్హులెవరూ సంక్షేమానికి దూరం కాకూడదని చెప్పారు. అదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

ఆదర్శ గ్రామాల కోసం డిసెంబర్ 1 నుంచి పనుల్లో వేగం

డిసెంబర్ 1 నుంచి గ్రామాల్లో అభివృద్ధి పనులు మరింత వేగంగా సాగుతాయని సీతక్క తెలిపారు. సర్పంచ్‌లు, అధికారులు, ప్రజలు కలిసికట్టుగా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ములుగును ఆదర్శ జిల్లాగా, ములుగు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని కోరారు.