బీఆర్ఎస్ నేతల అరెస్టులు: డీజీపీ వివరణ ఇవ్వాలి

హైదరాబాద్: బీఆర్ఎస్ నేతల అరెస్టులు, గృహ నిర్బంధాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఖండించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు (కేఆర్ఎంబీ) వినతిపత్రం ఇవ్వాలనుకున్న నేతలను ఉదయం నుంచే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు.

సబితా ఇంద్రారెడ్డి, దాసోజు శ్రవణ్ కుమార్, కాలేరు వెంకటేశ్, కంచర్ల భూపాల్‌రెడ్డి నిర్బంధంలో ఉన్నారని తెలిపారు. పోలీసులు ఎందుకు అడ్డుకున్నారో రాష్ట్ర డీజీపీ వెంటనే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బోర్డుకు వినతిపత్రం ఇవ్వాలనుకున్నామని, నిరసన లేదని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ నేతల అరెస్టులు, సాగర్ ప్రాజెక్టు వివాదం

నాగార్జున సాగర్ సమీపంలో ఆంధ్రప్రదేశ్ అనుమతుల్లేకుండా ప్రాజెక్టు నిర్మిస్తోందని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల తాగు, సాగునీటికి నష్టమని హెచ్చరించారు.

చంద్రశేఖర్ రావు ఆదేశాలతోనే వెళ్తున్నామని చెబుతూ నిర్బంధితులను విడుదల చేయాలని కోరారు.