హైదరాబాద్: బేగంబజార్ వ్యాపారుల ప్రతినిధి బృందం సోమవారం ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీని కలిసింది. దారుస్సలాంలో ఆయనను కలిసిన వ్యాపారులు రోడ్డు విస్తరణతో తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
బేగంబజార్ వ్యాపారులకు నష్టం జరగకూడదన్న ఒవైసీ
ఈ అంశాన్ని జోనల్ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తానని ఒవైసీ హామీ ఇచ్చారు. వారితో అవసరమైన చర్చలు జరుపుతానని చెప్పారు. దీనివల్ల ఆ ప్రాంతంలో అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయని పేర్కొన్నారు. అదే సమయంలో రోడ్డు విస్తరణ కారణంగా ఏ వ్యాపారి వ్యాపారం, జీవనోపాధి దెబ్బతినకూడదని ఆయన అన్నారు.
