దీక్షా దివస్: అలుగునూరు సభకు కేటీఆర్

హైదరాబాద్: దీక్షా దివస్ సందర్భంగా నవంబర్ 29న కరీంనగర్‌లోని అలుగునూరులో బహిరంగ సభ నిర్వహిస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఈ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాన అతిథిగా పాల్గొని మాట్లాడతారు. సాయంత్రం 3 గంటలకు సభ మొదలవుతుందని పార్టీ తెలిపింది.

దీక్షా దివస్ రోజునే కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నవంబర్ 29 ఎంతో కీలకమైన రోజని బీఆర్ఎస్ పేర్కొంది. ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడి కేసీఆర్ అదే రోజు ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారని గుర్తుచేసింది. ఆ దీక్షతో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ దేశమంతా చర్చనీయాంశమైందని తెలిపింది.

దీక్షా దివస్ సభ జరిగే అలుగునూరులోనే దీక్ష సమయంలో కేసీఆర్ అరెస్టయ్యారని పార్టీ వివరించింది. ఉద్యమ చరిత్రను మళ్లీ స్మరించుకోవాలని, ఉద్యమంలో భాగమైనవారి త్యాగాలను గుర్తుచేసుకోవాలని పిలుపునిచ్చింది.